నాణ్యమైన విద్యను అందించండి | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యను అందించండి

Jun 24 2025 7:35 AM | Updated on Jun 24 2025 7:35 AM

నాణ్య

నాణ్యమైన విద్యను అందించండి

సిద్దిపేటరూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్‌ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో జిల్లా విద్యాశాఖ బడిబాట, వేసవిలో జరిగిన ఉపాధ్యాయుల శిక్షణ, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ, టాస్‌, ఉల్లాస్‌, తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ సమయపాలన పాటిస్తూ, విద్యార్థులకు కృత్యాధార బోధన నిర్వహిస్తూ క్లిష్టమైన అంశాలు సలువుగా అర్థమయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఐఈఓ రవీందర్‌రెడ్డి, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు, 26 మండలాల ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.

జాతీయ అవార్డులకు

పంచాయతీలు పోటీ పడాలి

జాతీయ అవార్డుల కోసం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు పోటీలో పాల్గొనాలని కలెక్టర్‌ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. జాతీయ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడంపై సోమవారం జిల్లా, మండల స్థాయి అధికారులకు కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌తో కలిసి శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అవార్డులు, ప్రశంసలు సమర్థవంతంగా పని చేయడానికి ఎంతో ప్రోత్సాహం అందిస్తాయన్నారు. అనంతరం వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈత, మునగ మొక్కలు ప్రధానంగా నాటాలని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రమేష్‌, డీఆర్డీఓ జయదేవ్‌ ఆర్య, డీపీఓ దేవకీదేవి, హౌసింగ్‌ పీడీ దామోదర్‌ రావు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఎంఈఓలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్‌

సిద్దిపేటకమాన్‌: న్యాయమూర్తి సాయిరమాదేవిని జిల్లా కోర్టులో కలెక్టర్‌ హైమావతి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన తరుణంలో జిల్లా జడ్జిని ఆమె కలిసి మొక్కను అందించారు. ఈ సందర్భంగా ఇరువురు జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు.

కలెక్టర్‌ హైమావతి

అధికారులకు దిశానిర్దేశం

అభివృద్ధిలో ఎంపీడీఓలే కీలకం

దుబ్బాక: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో ఎంపీడీఓల పాత్ర కీలకమని కలెక్టర్‌ హైమావతి అన్నారు. సోమవారం సాయంత్రం ఎంపీడీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌శర్మ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎంపీడీఓలు కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలు కలెక్టర్‌కు వివరించామని భాస్కర్‌శర్మ తెలిపారు. అందరం సమష్టిగా పనిచేసి జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్దామని కలెక్టర్‌ సూచించారని తెలిపారు.

నాణ్యమైన విద్యను అందించండి 1
1/1

నాణ్యమైన విద్యను అందించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement