
ఇన్‌చార్జి మంత్రిని కలిసిన నాగపురి
చేర్యాల(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్‌ను సోమవారం మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగంగౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకుడు నాగపురి కిరణ్‌కుమార్‌గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు చేర్యాల ప్రాంతంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పట్టణంలో అసంపూర్తిగా ఉన్న సమీకృత భవనం నిర్మాణం పూర్తి చేయాలని, అలాగే నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి అవసరమైన డాక్టర్లను నియమించాలని కోరారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి హోదాలో చేర్యాల పట్టణ అభివృద్ధిపై రివ్యూ నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. వీటన్నింటిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.