
పునరావాస ప్యాకేజీ కల్పించాల్సిందే
ములుగు(గజ్వేల్): పునరావాస ప్యాకేజీ కల్పించాలంటూ కొండపోచమ్మ రిజర్వాయర్‌లో ముంపునకు గురైన మామిడ్యాల గ్రామ నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ములుగు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. అధికారులు, సిబ్బంది లోపలికి వెళ్లకుండా ప్రధాన ద్వారం ఎదుట అడ్డుకున్నారు. బీజెపీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు రమేష్‌యాదవ్ ఆధ్వర్యంలో బీజెపీ శ్రేణులు ఆందోళనకారులకు మద్దతు తెలిపాయి. ఈ సందర్బంగా నిర్వాసితులు మాట్లాడుతూ ప్రాజెక్ట్ పేరిట తమ భూములు లాక్కొని తమకు పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ప్యాకేజీలు అందజేయాలని లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్కడికి చేరుకున్న తహసీల్దార్ ఆరీఫా నిర్వాసితులతో మాట్లాడారు. విషయం ఆర్‌డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది.
‘కొండపోచమ్మ’ నిర్వాసితుల ఆందోళన