
గరుడ వాహనంపై వేణుగోపాలుడు
వర్గల్(గజ్వేల్): పురాతన వర్గల్ వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అర్చకులు గర్భగుడిలో కొలువైన రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి మూల విగ్రహాలకు అభిషేకం నిర్వహించి విశేషాలంకరణ చేశారు. రాత్రి స్వామివారి గరుడోత్సవసేవ నేత్రపర్వం చేసింది. సర్వాలంకారశోభితులైన వేణుగోపాలస్వామివారు, రుక్మిణి సత్యభామ సమేతులై గరుడవాహనం అధిష్ఠించారు. పురవీథులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సేవలో భక్తులు పాల్గొని తరించారు.
నేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు