వర్గల్(గజ్వేల్): పురాతన ప్రాశస్త్యం కలిగిన వర్గల్ వేణుగోపాలుని కోవెల బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఉత్సవాలలో రెండోరోజు ఆదివారం గరుడ ధ్వజారోహణ మహోత్సవం నేత్రపర్వం చేసింది. సకల దేవతలకు నవాహ్నిక బ్రహ్మోత్సవ ఆహ్వానం చేరింది. మొదట విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రుడైన గరుడాళ్వారు చిత్రంతో కూడిన పతాకానికి అర్చకస్వాములు విశేష పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద పతాకానికి రుత్వికులు షడ్రషోపచార పూజలు చేశారు. భక్తుల కరతాళ ధ్వనులు, మంగళవాయిద్యాల మధ్య గరుడ పతాకం ధ్వజస్తంభ శిఖరాగ్రానికి చేరింది. యాగశాలలో సంప్రోక్షణ జరిపి హోమం నిర్వహించారు.
హ్యూమన్‌రైట్స్ జిల్లా అధ్యక్షుడిగా మహేందర్
మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలం బైరాన్‌పల్లికి చెందిన మెడిచెల్మి మహేందర్ జిల్లా హ్యూమన్‌రైట్స్ అధ్యక్షుడిగా నియామకమయ్యారు. నేషనల్ హ్యూమన్‌రైట్స్ చైర్మన్ రాజేష్‌కన్నా ఆచార్య నియామకపత్రాని అందించారు. మహేందర్ మాట్లాడుతూ త్వరాలో జిల్లాల్లో పర్యటించి మానవ హక్కుల గురించి అందరికీ తెలిసేలా పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.
కట్టపై నిఘా నేత్రాలేవీ?
దుబ్బాకటౌన్: పట్టణంలోని రామసముద్రం కట్ట సుందరీకరణలో భాగంగా 2019లో స్వర్గీయ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేతుల మీదుగా నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం నిఘా నేత్రాల జాడ లేకుండా పోయింది. కట్టపై చిల్డ్రన్స్ పార్కు వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గతంలో కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్టాండ్‌లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. అధికారులు స్పందించి కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఈఏపీసెట్‌లో 22వ ర్యాంకు
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఈఏపీసెట్ ఫలితాలలో మండల విద్యార్థి ఉత్తమ ర్యాంక్ సాధించారు. అయినపూర్‌కు చెందిన తాళ్లపల్లి పాండురంగం కుమారుడు తాళ్లపల్లి వెంకటేష్ ఇంజనీరింగ్ విభాగంలో స్టేట్ 22వ ర్యాంక్ సాధించారు. దీంతో గ్రామానికి చెందిన పలువురు అతనిని అభినందించారు.

నేత్రపర్వంగా ధ్వజారోహణం