
సైన్యానికి మద్దతుగా నిలుద్దాం
ఎంపీ రఘునందన్‌రావు
దుబ్బాక: ఆపరేషన్ సిందూర్‌తో మనదేశ శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలపామని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం దుబ్బాకలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పహల్గామ్‌లో ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్‌తో మన సైనికులు పాక్‌కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. భారత్–పాక్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశమంతా మన సైన్యానికి మద్దతుగా నిలవాలన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైన్యానికి అండగా ఉందామన్నారు.
పహల్గామ్ కన్నీటికి బదులు తీర్చుకున్న దేశం
నంగునూరు(సిద్దిపేట): నాడు సీతమ్మ కన్నీరు పెడితే రామ, రావణ యుద్ధం జరిగితే.. నేడు పహల్గామ్‌లో మహిళలు కన్నీరు పెడితే పాకిస్తాన్‌తో యుద్ధం జరిగిందని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. నర్మేటలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఎంపీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.