
డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తాం
సిద్దిపేటరూరల్: చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్ గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తిస్థాయిలో నిర్మించి అందిస్తామని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి తెలిపారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని పుల్లూరు, చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసంపూర్తి డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించి వేగంగా పూర్తి చేయాలని అధికారును ఆదేశించారు. లబ్ధిదారులు ఎవరు కూడా అధైర్య పడవద్దని అందరికీ న్యాయం చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన పుల్లూరులోని వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.