
మంత్రికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న గిరిజన నాయకులు
ట్విట్టర్‌లో ఆర్టీసీ ఎండీ సమాధానం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి నుంచి వేములవాడకు బస్సుసౌకర్యం కల్పించాలని ఓ భక్తుడు ట్విట్టర్‌లో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌కు విన్నవించారు. ఈవిషయమై సజ్జనార్ స్పందిస్తూ త్వరలోనే భక్తుల కోరిక నెరవేరుతుందని సమాధానం ఇచ్చారు.
రేపు మంత్రి సత్యవతి రాథోడ్ రాక
అక్కన్నపేట(హుస్నాబాద్): రాష్ట్ర గిరిజనాభి వృద్ధి, సీ్త్ర,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఈ నెల 4న అక్కన్నపేట మండలానికి రానున్నారు. ఇటీవల మండలానికి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.33.58కోట్ల నిధులు బీటీ రోడ్ల నిర్మాణానికి మంజూరయ్యాయి. ఈ క్రమంలో స్థానిక ఎంపీపీ మాలోతు లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు భూక్య మంగ, ఎంపీపీ లకావత్ మానస, పలువురు గిరిజన నాయకులు హైదరాబాద్‌లోని మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి పర్యటన ఖరారు అయ్యింది.
బెజ్జంకిని కరీంనగర్ జిల్లాలో కలపండి
బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలిపేలా నాయకుల మనుసు మార్చాలని కోరుతూ సోమవారం బెజ్జంకిలోని గాంధీజీ విగ్రహానికి పోరాట సమితి నాయకులు వినతి పత్రం అందజేశారు. గతంలో కరీంనగర్ జిల్లాలో ఉండేదని, తిరిగి పాత జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, స్వెరోస్ నాయకులు దోనె అశోక్, దాచారం ఎంపీటీసీ రాజు, వెంకటేశం, డీవీ రావు, మానాల రవి, లింగాల శ్రీనివాస్, రవి, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.
వర్గల్ సిగలో డీసీసీబీ బ్యాంక్
నేడు ప్రారంభించనున్న మంత్రి
వర్గల్(గజ్వేల్): వర్గల్ సిగలో మరో బ్యాంకు చేరింది. ఇప్పటికే వర్గల్‌లో భారతీయ స్టేట్ బ్యాంకు, బరోడా బ్యాంకు సేవలందిస్తుండగా తాజాగా డీసీసీబీ (సహకార బ్యాంకు శాఖ) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మేనేజర్ నర్సింహారెడ్డి తదితర సిబ్బందిని సైతం నియమించారు. మంగళవారం ఉదయం మంత్రి హరీశ్‌రావు బ్యాంకును ప్రారంభించనున్నారు. పంచాయతీల విస్తరణలో భాగంగా నూతన గ్రామపంచాయతీగా ఆవిర్భవించిన వర్గల్ మండలం అవుసులోనిపల్లిలో రూ.35 లక్షలతో ఆధునిక హంగులతో పంచాయతీ భవనం నిర్మితమైంది. ఈ భవనాన్ని మంత్రి ప్రారంభిస్తారు.

గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం ఇస్తున్న పోరాట సమితి నాయకులు

వర్గల్‌లో డీసీసీబీ భవనం