
వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీ శ్వేత, అధికారులు
సిద్దిపేటకమాన్: పెండింగ్ కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలని డీజీపీ అంజనీకుమార్ జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. మంగళవారం హైదరాబాద్ డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేసుల్లో శిక్షల శాతం పెంచడంపై సీపీ శ్వేత, పోలీసు సిబ్బందిని అభినందించారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా సబ్ డివిజన్, సర్కిల్, పోలీసు స్టేషన్ల పరిధిలో శోభాయాత్రల రూట్ మ్యాప్‌ను తయారు చేసుకోవాలని, ఎలాంటి ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. రిసెప్షన్, క్రైమ్ వర్టికల్, టెక్ టీమ్, స్టేషన్ రైటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, తదితర విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు గ్రామాల్లో అవగాహన కార్యక్రాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సీపీ శ్వేత, అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏసీపీలు దేవారెడ్డి, రమేష్, సతీష్, సీఐలు, పోలీసులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ అంజనీకుమార్