
కొమురవెల్లి(సిద్దిపేట): తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశమంతా జరగాలనీ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. కొమురవెల్లి పాత కమాన్ నుంచి మల్లన్న ఆలయం వరకు రూ.10.32కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను మంగళవారం ప్రారంభించారు. పార్టీ మండల అధ్యక్షుడు గీస భిక్షపతి ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, 38మందికి డబుల్ బెడ్‌రూం ఇండ్ల పట్టాలను ఎమ్మెల్సీ కోటిరెడ్డి, తహసీల్ధార్ లక్ష్మీనారాయణతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం పాల్గొని మాట్లాడారు. పారే నది నీటిని 517 మీటర్ల ఎత్తులో మల్లన్న సాగర్‌కు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో అధిక మోజార్టీతో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ తలారి కీర్తన, వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్ రెడ్డి, చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశం, సర్పంచ్‌లు సార్ల లత, బోడుగాం పద్మ, సద్ది కృష్ణారెడ్డి, స్వామి, మండల నాయకులు కిషన్, సార్ల కిష్టయ్య, కృష్టారెడ్డి, నర్ర రఘువీరరెడ్డి పాల్గొన్నారు.
గులాబీ జెండా ఎగరడం ఖాయం
మద్దూరు(హుస్నాబాద్): రానున్న రోజుల్లో ఎర్రకొటపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని లద్నూరులో పంచాయతీ భవన నిర్మాణానికి ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లిపెద్ది సుమలత, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు వంగ భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ గుజ్జుక సమ్మయ్య, సర్పంచ్ జీడికంటి సుదర్శన్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి, ఉపసర్పంచ్ బెడద కుమారస్వామి, కనుకరాజు, నాయకులు శ్రీనివాస్‌చారి, రాజు, రవిరాజు, బాలు, ప్రభాకర్, సోమ్మయ్య, నందు, పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం