
ఏబీవీపీ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు
సిద్దిపేటజోన్: టీఎస్‌పీఎస్సీ లీకేజీపై సీబీఐతో విచారణ చేయాలని ఏబీవీపీ ఉమ్మడి జిల్లా విభాగ్ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా సీఐ భిక్షపతి ముట్టడికి యత్నించిన నాయకులను అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ ఘటన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్‌ను విచారించాలన్నారు. నిరసనలో వివేక్, శశి, ఆకాష్, ఆదిత్య, సంజయ్, ప్రసాద్ పాల్గొన్నారు.