
ఎన్‌సీసీ కేడెట్‌కు ప్రశంసపత్రం అందిస్తున్న సీపీ శ్వేత, పక్కన అడిషనల్ డీసీపీ మహేందర్
సిద్దిపేటకమాన్: క్రమశిక్షణకు మారుపేరు ఎన్‌సీసీ అని సిద్దిపేట సీపీ శ్వేత అన్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విధులు నిర్వర్తించిన సిద్దిపేట, గజ్వేల్ ఎన్‌సీసీ సిబ్బందిని సోమవారం సీపీ కార్యాలయంలో ప్రశంస పత్రాలతో అభినందించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది ఆదివారాలు 170 మంది ఎన్‌సీసీ సిబ్బంది ట్రాఫిక్, క్యూలైన్, గర్భగుడి, చిన్న, పెద్ద పట్నం, తదితర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారని తెలిపారు. ఎన్‌సీసీ పూర్తయిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చని పోలీసు శాఖ తరపున సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరుపుకున్నామన్నారు. ఎన్‌సీసీ కేడెట్స్‌కు ప్రశంస పత్రాలతో పాటు, స్టీల్ వాటర్ బాటిల్‌ను అందించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, సీఐ సత్యనారాయణరెడ్డి, ఆర్‌ఐ అడ్మిన్ శ్రీధర్ రెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత