డబ్బుల కోసమే డమ్మీలు.!
వారి నామినేషన్లతో అభ్యర్థులకు తలనొప్పి
జహీరాబాద్ టౌన్: సర్పంచ్ ఎన్నికలంటేనే పల్లెల్లో సందడి. నోటిఫికేషన్ జారీతో పాటు రిజర్వేషన్లు ఖరారు కావడంతో నామినేషన్ల పక్రియ కొనసాగుతుంది. సర్పంచ్‌గా పోటీ చేయాలన్న ఉద్దేశంతో కొంత మంది అఽభ్యర్థులు కొన్ని రోజుల ముందు నుంచే పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కుల సంఘాల నాయకులు, యువత, మహిళలను మచ్చిక చేసుకునేందుకు ఖర్చు చేస్తూ హామీలు ఇస్తున్నారు. మరి కొంత మంది గ్రామ పంచాయతీ ఎన్నికలను సొమ్ము చేసుకోవాలని, డమ్మీ నామినేషన్లు వేస్తున్నారు. నామినేషన్ వేసిన తరువాత ఎంతో కొంత తీసుకుని ఉపసంహరించుకోవాలని సిద్ధమవుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని అధిక శాతం గ్రామ పంచాయతీల్లో డమ్మీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఉపసంహరణ సమయంలో నగదు ఇస్తే నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. డమ్మీ అభ్యర్థులతో సర్పంచ్‌కు పోటీ చేస్తున్న అభ్యర్థులకు తలనొప్పిగా మారనుంది.
మద్యం పట్టివేత
కేసు నమోదు
రేగోడ్(మెదక్): అక్రమంగా బెల్టు దుకాణం నడుపుతూ మద్యం విక్రయిస్తున్న హోటల్‌పై దాడి చేసి మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ పోచయ్య వివరాల ప్రకారం... విశ్వసనీయ సమాచారం మేరకు హోటల్‌ను తనిఖీ చేయగా అందులో 6.6 లీటర్ల మద్యం లభించిందని, దీని విలువ రూ.3,750 ఉంటుందని చెప్పారు. హోటల్ యజమానిపై కేసు నమోదు చేశారు.
వాహన తనిఖీల్లో
రూ.30 లక్షలు స్వాధీనం
చేగుంట(తూప్రాన్): ఆకస్మిక తనిఖీల్లో పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం... మంగళ వారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీం పభ్యులు బైకుపై వెళుతున్న వ్యక్తులను తనిఖీ చేయగా వారివద్ద రూ.30 లక్షల 59,500 దొరికాయి. గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెందిన గుండెల్లి శిరీష, యాదగిరి దంపతులు తీసుకెళ్తున్న డబ్బులకు ఎలాంటి పత్రాలు చూపని కారణంగా ఎన్నికల నిబంధనల మేరకు డబ్బులను సీజ్ చేసి విచా రణ కోసం తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా నగదును అక్రమంగా తీసుకెళ్తే కేసులు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మందుబాబులకు జరిమానా
పటాన్‌చెరు టౌన్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుపడిన వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమాన విధించింది. ట్రాఫిక్ సీఐ లాలూనాయక్ కథనం ప్రకారం... సోమవారం నిర్వహించిన తనిఖీల్లో 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని మంగళవారం కోర్టులో హాజరుపరచగా ఎనిమిది మందికి రూ. వెయ్యి, ముగ్గురికి రూ.1500, మరో ముగ్గురికి రూ.2 వేలు చొప్పున జరిమాన విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
సంగారెడ్డిలో ఆరుగురికి..
సంగారెడ్డి క్రైమ్: సంగారెడ్డి పట్టణ పరిధిలో సోమవారం నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఆరు మందిని అదుపులోకి తీసుకున్నట్లు సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. వారిని మంగళవారం సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా జిల్లా మెదటి అదనపు న్యాయమూర్తి షకీల్ అహ్మద్ సిద్దిఖీ ఇద్దరికి రూ.2వేలు, మిగతా ఒకరికి రూ.1500, మిగతా ముగ్గురికి రూ.వెయ్యి చొప్పున జరిమాన విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్గొన్నారు.
అల్లర్లు సృష్టిస్తే క్రిమినల్ కేసు
మునిపల్లి(అందోల్): గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అనవసరంగా ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే క్రిమినల్ కేసు నమోదు చేయాలని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య పోలీసులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రమైన మునిపల్లి రైతు వేదికలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ సెంటర్‌ను కొండాపూర్ సీఐ సుమన్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఫేక్ వార్తలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించినట్లు తెలిపారు. మండలంలోని రౌడీ షీటర్లను, 120 మందిని తహసీల్దార్ గంగాభవాని ఎదుట బైండోవర్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
నలుగురికి గాయాలు
బెజ్జంకి(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో అధికా రులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా...బెజ్జంకిలో ఉద్యోగ బాధ్యతల నిర్వహణ కోసం కరీంనగర్ నుంచి వస్తున్న రెవెన్యూ, పోలీస్ సిబ్బందికి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆర్‌ఐ సంతోష్, టైపిస్ట్ సంతోష్, జూనియర్ అసిస్టెంట్ శేఖర్, హెడ్ కానిస్టేబుల్ కనకయ్యలకు గాయాలయ్యాయి. వీరిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


