సమానపనికి సమాన వేతనం ఇవ్వాలి
ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రహమాన్
సదాశివపేట(సంగారెడ్డి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు సమానపనికి సమాన వేతనం రూ.25 వేలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎంఏ రహమాన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆర్‌ఎంఓ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంట్రాక్టు శానిటేషన్, పేషంట్‌కేర్ సెక్యూరిటీ గార్డులకు సమానపనికి సమాన వేతనం అందక కాంట్రాక్టు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పాత టెండర్ల కాలపరిమితి ముగియడంతో నూతన టెండర్లలో కార్మికులకు కనీస వేతనం రూ.25 వేలుగా నిర్ణయించాలన్నారు. కార్యక్రమంలో కార్మికులు మోహిన్, పుష్పమ్మ, రాములమ్మ, లక్ష్మమ్మ, వెంకటేశం, శ్రీనివాస్‌గౌడ్, అనిల్, నిఖిల్, సంధ్య, రేణుక, మీనా, కృష్ణమ్మ, మల్లేశం, సుదర్శన్ పాల్గొన్నారు.


