పేద విద్యార్థులకు ట్రస్ట్ సహకారం
చేగుంట(తూప్రాన్): పేద విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థ ఉపకార వేతనం అందించడం అభినందనీయమని జిల్లా విద్యాధికారి విజయ పేర్కొన్నారు. మండలంలోని చందాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం చావలి లక్ష్మీ సుబ్రహ్మణ్యం ఫౌండేషన్ మంజూరీ చేసిన ఉపకార వేతన చెక్కులను ఆమె అందజేసి మాట్లా డారు. విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం కల్పించేందుకు ట్రస్టు ద్వారా డబ్బులు మంజూరు చేయించిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌ను డీఈఓ అభినందించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. 51 మంది విద్యార్థులకు ఫౌండేషన్ మంజూరు చేసిన రూ.43,350 చెక్కులను ఆమె అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నీరజ, ఇన్‌చార్జీ ప్రధానోపాధ్యాయుడు విఠల్‌రెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకట్‌రాంరెడ్డి, ఉపాధ్యాయులు లక్ష్మణ్, నర్సింహులు, సలీం, వీణ, రాములు, గిరిధర్, స్వప్న, బంగారయ్య, సౌజన్య, దామోదర్ యాదగిరి, విద్యార్థులు పాల్గొన్నారు.


