
నేరాల నియంత్రణకు సహకరించాలి
●
డీఎస్పీ నరేందర్‌గౌడ్
చిరుత పులి అలజడి
కల్హేర్(నారాయణఖేడ్): మండలంలో చిరుత పులి సంచారం కలంకలం రేపింది. గురువారం కృష్ణాపూర్ శివారులో పాదముద్రలు వెలుగుచూశాయి. కొంత కాలంగా కృష్ణాపూర్, ఖానాపూర్(కె), బీబీపేట్, రాపర్తి, నాగధర్, కడ్పల్, తదితర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తోంది. నల్లవాగు కాల్వ పక్కన పాదముద్రలు కనిపించడంతో కాంట్రాక్టర్ నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఈఈ పవన్‌కుమార్, ఇరిగేషన్ అధికారులు పాదముద్రలు పరిశీలించి అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత సంచారంతో ప్రజలు భయందోళన చెందుతున్నారు.
మొబైల్ క్యాంపు ఏర్పాటు చేయాలి
జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్న బీడీ మహిళా కార్మికుల కోసం మొబైల్ క్యాంపులను యథావిధిగా కొనసాగించాలి. అవసరమైన అంబులెన్‌న్స్ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలి.
–మల్లేశం( హెచ్‌ఎంఎస్ జిల్లా అధ్యక్షుడు)
తూప్రాన్: నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎస్పీ నరేందర్‌గౌడ్ పేర్కొన్నారు. గురువారం పోలీస్ డివిజన్ పరిధిలోని హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్ నిర్వాహకులతో పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దాబాల వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. రాత్రి 12 గంటల లోపు హోటళ్లు, దాబాలు మూసివేయాలని సూచించారు. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. దాబాల్లో మద్యం సిట్టింగ్‌లకు అనుమతి లేదని, నిర్వాహకులతో పాటు తాగిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ సీఐలు రంగాకృష్ణ, జాన్‌రెడ్డి, వెంకటరాజాగౌడ్, ఎస్‌ఐలు శివానందం, లింగం, చైతన్యరెడ్డి పాల్గొన్నారు.

నేరాల నియంత్రణకు సహకరించాలి

నేరాల నియంత్రణకు సహకరించాలి