
ట్రాన్స్‌ఫార్మర్ జెంపర్ సరిచేస్తుండగా..
విద్యుదాఘాతంతో రైతు మృతి
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యుదాఘాదంతో రైతు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండలంలోని భుజిరంపేట పీర్యతండా పంచాయతీ మన్యతండాలో గు రువారం జరిగింది. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి వివరాల ప్రకారం... మన్యతండాకు చెందిన రైతు పాత్‌లోత్ బన్సీ (బన్సీలాల్)(38) గురువారం ఉదయం కూకుట్లపల్లి శివారులోని తన పొలంలో వరి నారుకు మందు పిచికారీ చేస్తుండగా నీళ్లు లేకపోవడంతో బోరు మోటార్‌ను ఆన్ చేశాడు. అది నడవకపోడంతో పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద జెంపర్ సరిచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయా డు. గమనించిన పక్క పొలంలోని రైతు కుటుంబ సభ్యులకు తెలుపడంతో వారు వచ్చి చూడగా బన్సీలాల్ అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, కొడుకు ఉన్నారు.