
కమలాపూర్‌లో వ్యక్తి హత్య
పెద్దశంకరంపేట(మెదక్): వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండలంలోని కమలాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తోట సుధాకర్(43) ఆటో నడుపుకుంటూ గ్రామంలోనే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతడికి గతంలో వివాహం కాగా భార్య చనిపోయింది. వీరికి దివ్యాంగుడైన కుమారుడు, కుమార్తె ఉన్నారు. బుధవారం రాత్రి సుధాకర్ ఇంటిముందు నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు తలపై పదునైన ఆయుధంతో దాడి చేయగా అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు క్లూస్ టీం, జాగిలాలతో వివరాలు సేకరించారు. ఘటనాస్థలాన్ని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, అల్లాదుర్గం సీఐ.రేణుకారెడ్డి, ఎస్‌ఐలు ప్రవీణ్‌రెడ్డి, శంకర్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి తోట మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
తలపై పదునైన ఆయుధంతో దాడి
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ప్రసన్నకుమార్