
నేడు డయల్ యువర్ డీఎం
నారాయణఖేడ్: ఖేడ్ ఆర్టీసీ డిపోలో ఈనెల 13వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు డిపో మేనేజర్ మల్లేశయ్య సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. డిపో పరిధిలోని ప్రయాణికులు, ప్రజలు ఆర్టీసీకి సంబంధించిన సమస్యలతోపాటు మరింత మెరుగైన సేవలు అందించడానికి సూచనలు, సలహాలను ఇవ్వడానికి 9063417161 నంబరుకు ఫోన్‌చేసి వివరించాలని సూచించారు.
జీతంపై అవగాహన ఉండాలి
ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: పోలీసు అధికారులు సిబ్బంది పోలీసు జీతం ప్యాకేజీ గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. గతేడాది డిసెంబర్ 31న రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన హోంగార్డు మశ్చేందర్ కుటుంబానికి మంజూరైన చెక్కును బ్యాంకు అధికారులతో కలసి ఎస్పీ చేతుల మీదుగా అందించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందినందుకు రూ.30 లక్షలు, ఇద్దరి పిల్లల చదువు నిమిత్తం రూ.4లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి కల్యాణి, ఆర్ ఐ డానియల్, బ్యాంక్ మేనేజర్ రాజేందర్ తదితరులున్నారు.
ఎస్టీ గురుకులాల్లో
ప్రవేశాలకు కౌన్సెలింగ్
కంగ్టి(నారాయణఖేడ్): గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 15, 16 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని గురుకుల ప్రతిభా కళాశాల, కల్వంచలోని శాంతినగర్ భాగ్యలత కళాశాలలో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. ఈ నెల 15వ తేదీన బాలురకు, 16వ తేదీన బాలికలు తమకు సంబంధించిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆధార్, స్పోర్ట్స్, పీహెచ్‌సీ సర్టిఫికెట్లు, మూడు కలర్ ఫొటోలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.
కొనుగోళ్లు వేగవంతం
డీఆర్‌డీఓ పీడీ జ్యోతి
వట్‌పల్లి(అందోల్): ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా డీఆర్‌డీఓ పీడీ జ్యోతి సూచించారు. కేరూర్‌లో ఏర్పాటుచేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడగా హమాలీలు సమయానికి రాకపోవడంతో కొనుగోళ్లలో ఆలస్యం జరిగిందని తెలిపారు. అనంతరం ఆమె రైతులతో మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలని సూచించారు. తూకం చేసిన వెంటనే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలన్నారు.
లోక్‌అదాలత్‌పై
అవగాహన కల్పించండి
నారాయణఖేడ్: లోక్‌అదాలత్‌పై కక్షిదారులకు అవగాహన కల్పించి పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకునేలా చూడాలని ఖేడ్ జూనియర్ సివిల్‌జడ్జి కోర్టు న్యాయమూర్తి శ్రీధర్ మంథాని పోలీసు అధికారులకు సూచించారు. కోర్టులోని డివిజన్ పరిధి పోలీసు అధికారులతో సోమవారం లోక్‌అదాలత్‌పై నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి శ్రీధర్ పాల్గొని మాట్లాడారు. వచ్చేనెల 14న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. డీఎస్పీ వెంకట్‌రెడ్డి, డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు, కోర్టు విధులు నిర్వర్తించే పోలీసులు పాల్గొన్నారు.

నేడు డయల్ యువర్ డీఎం

నేడు డయల్ యువర్ డీఎం