
వేగవంతమైన అభివృద్ధికి ప్రణాళిక
ములుగు(గజ్వేల్) : రాష్ట్రంలో ఉద్యాన సాగు చేసిన రైతులు స్థిరమైన, వేగవంతమైన అభివృద్ధి సాధించేందుకు బృహత్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ములుగు కొండా లక్ష్మణ్ ఉద్యానవర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ దండా రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ములుగు ఉద్యానవర్సిటీ వేదికగా రైతులు, ఉత్పత్తిదారుల సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులు, ఆదర్శరైతులు, ఎఫ్‌పీఓ నాయకులు, వ్యవసాయ, వ్యాపార సంస్థలు, ఎగుమతిదారులు, ఇన్‌ఫుట్ సరఫరాదారులు, పరిశోధన నిపుణులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు పరిశ్రమ భాగస్వామ్యా లు, ఆవిష్కరణ, ఆధారిత సాగు, వాతావరణ స్థితిస్థాపక పంట ప్రణాళికను సులభతరం చేయడంలో విశ్వవిద్యాలయం నిబద్ధతను కొనియాడారు. మార్కెట్ పోకడలు, పంట వైవిద్యీకరణ వ్యూహాలు, ఎఫ్‌పీఓల ద్వారా సామర్థ్య నిర్మాణం, ఖచ్చితమైన వ్యవసాయం కోసం సాంకేతిక ఏకీకరణ, పంటల తర్వాత నిర్వహణ ఎగుమతి, ప్రాసెసింగ్ పరిష్కారాలు అంశాలపై సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు భగవాన్, చీనా నాయ క్, లక్ష్మీ నారాయణ, సురేశ్ కుమార్, రాజశేఖర్, వీణాజోషి, సతీష్, తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న వీసీ రాజిరెడ్డి
ఉద్యానవర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ రాజిరెడ్డి
పలు సంస్థలతో ప్రత్యేక సమావేశం