
పాపన్నపేట(మెదక్): చెరువులో దూకి యువ తి ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన మండల పరిధిలోని మల్లంపేటలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మల్లంపేట గ్రామానికి చెందిన చాకలి మల్లయ్య, శామల దంపతులకు ముగ్గురు ఆడ పిల్లలు. మల్లయ్య కరోనా సమయంలో చనిపోయాడు. తల్లి ఇద్దరు ఆడపిల్లల వివాహాలు చేసింది. బతుకు భారం కావడంతో శ్యామల చిన్న కూతురు ప్రియాంక(20)తో కలిసి హైదరాబాద్‌కి వలస పోయి జీవిస్తుంది.
ఇటీవల రెండు నెలల కిందట తల్లీబిడ్డలు స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో సోమవారం ప్రియాంక ఫోన్‌లో మాట్లాడుతూ రెడ్ల చెరువు వద్దకు వెళ్లి నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు.