నేటి నుంచి పాలీసెట్‌అభ్యర్థులకు ఉచిత శిక్షణ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పాలీసెట్‌అభ్యర్థులకు ఉచిత శిక్షణ

May 5 2025 8:18 AM | Updated on May 5 2025 8:18 AM

నేటి

నేటి నుంచి పాలీసెట్‌అభ్యర్థులకు ఉచిత శిక్షణ

నారాయణఖేడ్‌: పాలిటెక్నిక్‌లో ప్రవేశాల కోసం పాలీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఖేడ్‌ మండలం జూకల్‌ శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సోమవారం నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ సౌజన్య తెలిపారు. ఉన్నత విద్యతోపాటు స్వయం ఉపాధి అవకాశాలు, నైపుణ్యానికి సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణతోపాటు అవసరమైన మెటీరియల్‌ను ఉచితంగా అందజేస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు కళాశాలలో లేదా 95055 04211 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

నేడు సీపీఐ జిల్లా

కౌన్సిల్‌ సమావేశం

నారాయణఖేడ్‌: సీపీఐ పార్టీ జిల్లా కౌన్సిల్‌ సమావేశం సోమవారం ఖేడ్‌లోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నట్లు పార్టీ ఖేడ్‌ డివిజన్‌ కార్యదర్శి ఆనంద్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సమావేశానికి ఎమ్మెల్సీ నేలకంటి సత్యం, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నర్సింహ, జిల్లా కార్యదర్శి సయ్యద్‌ జలాలొద్దీన్‌తో పాటు ముఖ్య నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. నాయకులు చిరంజీవి, దత్తురెడ్డి, అశోక్‌, సతీశ్‌, ప్రేమ్‌ కుమార్‌, సంగమేశ్వర్‌, నర్సింహులు పాల్గొన్నారు.

పేదల పక్షాన

పోరాటం చేయాలి

సీపీఎం జాతీయ కార్యదర్శి డి.రాజా

జహీరాబాద్‌ టౌన్‌: పేదల పక్షాన పోరాటాలు చేయాలని, ఇళ్లు లేని వారికి స్థలాలు ఇప్పించడానికి ఉద్యమాలు చేయాలని సీపీఎం జాతీయ కార్యదర్శి డి.రాజా పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి గుల్బర్గాకు ఆయన వెళ్తుండగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జలాలోద్దీన్‌, జహీరాబాద్‌ డివిజన్‌ కార్యదర్శి నర్సిహులు తదితరులు హుగ్గెల్లి చౌరస్తాలో స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా రాజా కొంచెం సేపు పార్టీ శ్రేణులతో మాట్లాడారు. ఆయన వెంట మాజీ రాజ్య సభ్యుడు అజిజ్‌ పాషా ఉన్నారు.

నాగిరెడ్డిపల్లి

గ్రామాభివృద్ధికి కృషి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు

జహీరాబాద్‌: నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. ఆదివారం కోహీర్‌ మండలంలోని నాగిరెడ్డిపల్లిలో నిర్వహించిన దుర్గాభవానీ జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి దయతో రాష్ట్రం బాగుండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, జహీరాబాద్‌, సంగారెడ్డి ఎమ్మెల్యేలు కె.మాణిక్‌రావు, చింతా ప్రభాకర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎం.శివకుమార్‌, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ మంజూశ్రీ, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వై.నరోత్తం, పీఏసీఎస్‌ చైర్మన్‌ స్రవంతిరెడ్డి, ఆయా మండలాల బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు నర్సింహులు, నారాయణ, వెంకటేశం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి పాలీసెట్‌అభ్యర్థులకు ఉచిత శిక్షణ
1
1/2

నేటి నుంచి పాలీసెట్‌అభ్యర్థులకు ఉచిత శిక్షణ

నేటి నుంచి పాలీసెట్‌అభ్యర్థులకు ఉచిత శిక్షణ
2
2/2

నేటి నుంచి పాలీసెట్‌అభ్యర్థులకు ఉచిత శిక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement