ర్యాంక్‌లు కొలమానం కాదు | - | Sakshi
Sakshi News home page

ర్యాంక్‌లు కొలమానం కాదు

Mar 12 2025 9:04 AM | Updated on Mar 12 2025 9:04 AM

ర్యాంక్‌లు కొలమానం కాదు

ర్యాంక్‌లు కొలమానం కాదు

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): విద్యార్థులకు ర్యాంక్‌లు, మార్కులు కొలమానం కాకుండా సబ్జెక్ట్‌ల వారీగా విద్యార్థులు విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలని బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం మండలంలోని బస్వాపూర్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇన్పినేటివ్‌ విద్యా ఫౌండేషన్‌ సహకారంతో కంప్యూటర్‌ ల్యాబ్‌, సైన్స్‌ ల్యాబ్‌, రోబోటిక్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయగా కలెక్టర్‌ మనుచౌదరితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తుందని గ్రామంలోని విద్యార్థులను ప్రైవేట్‌ పాఠశాలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపించాలన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో తాగునీరు, రెండు తరగతి గదులు, స్పోర్ట్స్‌ మెటీరియల్‌ అవసరం ఉందని విద్యార్థులు అడగగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, డీపీవో దే వకీ, ఆర్డీవో రామ్మూర్తి, ఎంఈవో పద్మాయ్య, ఇన్పినేటివ్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం

అక్కన్నపేట(హుస్నాబాద్‌): గతంలో పెద్దవారికే కంటి అద్దాలు వచ్చేవి ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. అక్కన్నపేట మండల కేంద్రంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉచిత కంటి క్యాంపులో 304 మందికి స్క్రీనింగ్‌ చేసినట్లు తెలిపారు. 129 మందికి ఆపరేషన్‌ అవసరం కాగా 72 మంది సెలెక్ట్‌ అయ్యారన్నారు. 52 మందికి ఈరోజు, వచ్చే వారం మిగిలిన వారిని ఆపరేషన్‌కు తీసుకెళ్తామన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ మను చౌదరి, జిల్లా గంథ్రాలయం చైర్మన్‌ కేడం లింగమూర్తి, సింగిల్‌ విండో చైర్మన్‌ శివయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, డీఎంహెచ్‌వో పల్వాన్‌, ఆర్డీఓ రామ్మూర్తి పాల్గొన్నారు.

సబ్జెక్ట్‌ల వారీగా పరిజ్ఞానం పెంచుకోవాలి

విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచన

బస్వాపూర్‌లో కంప్యూటర్‌ ల్యాబ్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement