
శ్రీకాంత్ ఇంటి ఎదుట బైఠాయించిన ప్రశాంత్ కుటుంబ సభ్యులు
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని పందిల్ల గ్రామ సమీపంలో శనివారం రాత్రి రెండు బైక్‌లు ఢీ..కొన్న ఘటనలో అక్కన్నపేట మండలం గోవర్దనగిరి గ్రామానికి చెందిన పెండ్యాల ప్రశాంత్ మృతి చెందాడు. అయితే నూనె శ్రీకాంత్ ఢీ..కొట్టడంతోనే ప్రశాంత్ మృతి చెందాడని కుటుంబీకులు, బంధువులు, గ్రామస్థులు శ్రీకాంత్ ఇంటి ఎదుట ప్రశాంత్ మృతదేహంతో ఆందోళన చేశారు.
దేళ్లలోపు పిల్లలు ఉన్నారని, న్యాయం చేయాలని నిరసిస్తూ ఏడు గంటలపాటు నిరసన తెలిపారు. శ్రీకాంత్ కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో కరీంనగర్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంటివద్ద ఎవరూ లేకపోవడంతో పెద్దమనుఘుల సమక్షంలో సోమవారం మాట్లాడుకుందామని గ్రామస్థులు నచ్చచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.