
షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోతున్న పూరిగుడిసె
చేగుంట(తూప్రాన్): షార్ట్ సర్క్యూట్‌తో పూరిగుడిసె దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..మండలపరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన ఎర్రస్వామి మంగళవారం ఉదయం పొలం పనులకు వెళ్లాడు. మధ్యాహ్నంవేళ ఆయన నివసిస్తున్న పూరిగుడిసెకు షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు ట్యాంకర్లతో నీటిని తీసుకొచ్చేలోపే గుడిసెలో దాచిన నగదు, బంగారం, సర్టిఫికెట్లు దుస్తులు కాలిపోయాయి. రెవెన్యూ అధికారులు సంఘటనస్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు.
ట్రాన్స్‌ఫార్మర్ సామగ్రి చోరీ
నర్సాపూర్ రూరల్: ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ వైరును దొంగిలించారు. రైతులు చెప్పిన వివరాల ప్రకారం...మండల పరిధిలోని కాజీపేటలో చంద్రమ్మ పొలం వద్ద 25 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. దీని పరిధిలో 15 వ్యవసాయ బోరుమోటార్లు నడుస్తున్నాయి. మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం చేసి, అందులోని కాపర్ ఎత్తుకెళ్లారు. దీంతో పంటలు ఎండిపోయే పరిస్థితి దాపురించిందని రైతులు వాపోయారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
