
మహే శ్ కు చికిత్స చేస్తున్న వైద్యసిబ్బంది
జిన్నారం(పటాన్‌చెరు): బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో అక్రమంగా కొనసాగుతున్న గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాలపై సివిల్ సప్లయీస్ అధికారులు మంగళవారం దాడులు చేపట్టారు. జిల్లా సివిల్ సప్‌లై అధికారి వనజ ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో 145 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.
పేలిన ట్రాలీఆటో టైరు
ఒకరికి తీవ్రగాయాలు
పటాన్‌చెరు టౌన్: ట్రాలీఆటో టైరుపేలిన ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం పటాన్‌చెరు నుంచి స్క్రాప్‌బ్యాటరీ లోడ్‌ను చాదర్‌ఘాట్‌కు తీసుకెళుతుండగా, పాటి గ్రామశివారు ఓఆర్‌ఆర్ సమీపంలోకి రాగానే టైరుపేలి ఆటో బోల్తా కొట్టింది. దీంతో డ్రైవర్ మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
జగదేవ్‌పూర్(గజ్వేల్): విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందింది. మండల పరిధిలోని చిన్నకిష్టాపూర్ గ్రామానికి చెందిన బైరి ఐలయ్య మంగళవారం తన కాడెద్దులను మేత కోసం పొలానికి తీసుకెళ్లాడు. మేత మేస్తున్న క్రమంలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ వైర్లు తగిలి ఎద్దు అక్కడిక్కడే మృతి చెందింది.
రోడ్డు దాటుతుండగా..
జిన్నారం(పటాన్‌చెరు): మండల పరిధిలో ఖాజీపల్లి అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా పునుగుపల్లి మృతి చెందింది. మంగళవారం ఉదయం రోడ్డుపై పునుగు పిల్లి కళేబరం పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. సమీప అటవీప్రాంతంలో వీటి సంచారం ఎక్కువగా ఉందన్నారు.



పునుగు పిల్లి కళేబరం