
● ‘భగీరథ’ కష్టాలు
మొయినాబాద్: మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చి తాగునీటి సరఫరా చేస్తున్నా నీటి కష్టాలు మాత్రం తప్పడంలేదు. అక్కడక్కడ మిషన్ భగీరథ పైప్‌లైన్లు పగిలి లీకేజీ అయ్యి నీరు వృథాగా పారుతోంది. మున్సిపల్ కేంద్రంలోని లక్ష్మీగణపతినగర్ కాలనీ, భరద్వజ్ కాలనీ, ముస్తాఫాహిల్ కాలనీలకు నీటి సరఫరా సరిగా అందడంలేదు. మిషన్ భగీరథ నీళ్లు సరిగా రాకపోవడంతో బోర్ల ద్వారా నీళ్లు అందిస్తున్నా అవి కూడా సరిపోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ముర్తూజగూ డకు వెళ్లే భగీరథ పైప్‌లైన్ పగలడంతో గ్రామానికి నీళ్లు అందడం లేదు. బోర్లద్వారా నీటిసరఫరా చేస్తున్నారు. అజీజ్‌నగర్ హరిజనవాడలో మిషన్‌భగీరథ నీళ్లు ట్యాంకులోకి ఎక్కడంలేదు. హిమాయత్‌నగర్, మొయినాబాద్, అజీజ్‌నగర్‌లో తరచూ మిషన్ భగీరథ పైప్‌లైన్లు పగిలి నీళ్లు లీకవుతున్నాయి.