
రాజ్యాంగ రక్షణకే కాంగ్రెస్ పోరాటం
చేవెళ్ల: రాజ్యాంగ పరిరక్షణకే కాంగ్రెస్ పోరాడుతోందని.. ఈ నెల 4వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న జైబాపు, జై భీం, జై సంవిధాన్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, చేవెళ్ల పార్టమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి బొంతు రామ్మోహన్, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయుకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శుక్రవారం నిర్వహించనున్న ఈ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని.. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విదివిధానాలపై వివరిస్తారని చెప్పారు.
గ్రామ స్థాయి నాయకులతో సమ్మేళనం
తుక్కుగూడ: నగరంలోని ఎల్‌బీ స్టేడియంలో ఈ నెల 4న నిర్వహించనున్న కాంగ్రెస్ గ్రామస్థాయి నాయకుల సమ్మేళనం విజవయంతం చేయాలని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ పర్ణికారెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంట్ ముఖ్యనాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పర్ణికారెడ్డి మాట్లాడుతూ.. రేపు నిర్వహించనున్న సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గ్రామస్థాయి నాయుకులకు పార్టీబలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారని వివరించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి కేఎల్‌ఆర్, టీపీసీసీ ఉపాధ్యాక్షుడు బొంతు రామ్మోహన్, నాయకులు దేప భాస్కర్‌రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ సభను విజయవంతం చేయాలి
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి బొంతు రామ్మోహన్,నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి

రాజ్యాంగ రక్షణకే కాంగ్రెస్ పోరాటం