
● మట్టిరోడ్లే దిక్కు.. పట్టని వీధి దీపాలు
షాద్‌నగర్: పట్టణంలో నూతనంగా ఏర్పడిన పలు కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేక కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.లక్షలు వెచ్చించి ఇళ్లు నిర్మించుకున్నా సీసీ రోడ్లు లేకపోవడంతో యజమానులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న మట్టిరోడ్లు వర్షాలకు దెబ్బతిని గుంతలు తేలడంతో ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడుతున్నారు. శివారులో ఉన్న చాలా కాలనీల్లో వీధిదీపాలు సరిగా లేక రాత్రి సమయాల్లో అంధకారంలో మగ్గాల్సి వస్తోంది. రాత్రిళ్లు మహిళలు ఒంటరిగా బయటికి రావడానికి జంకుతున్నారు. వీధిదీ పాల నిర్వహణ ఏజెన్సీకి అప్పగించారు. ఏజెన్సీ వారికి మున్సిపా లిటీ లక్షల్లో బాకీ ఉండటంతో పట్టించుకోవడం లేదు.