
నేతాజీ పొదుపు సంఘానికి ఉత్తమ అవార్డు
మహేశ్వరం: సమాఖ్య పొదుపు సంఘంలో సభ్యులకు సక్రమంగా రుణాలు అందజేసి.. సకాలంలో వసూలు చేసినందుకు మన్సాన్‌పల్లి గ్రామానికి చెందిన నేతాజీ పొదుపు సంఘానికి ఉత్తమ అవార్డు వరించింది. సోమవారం శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకూలలో నిర్వహించిన అభ్యుదయ సమాఖ్య 13వ వార్షికోత్సవ మహాసభ నిర్వహించారు. తమ సంఘంలో 700 మంది సభ్యులకు గాను రూ.2.70 కోట్లు జమయ్యాయని చెప్పారు. వరుసగా నాల్గోసారి అవార్డు రావడం ఆనందంగా ఉందని సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభ్యుదయ సమాఖ్యా అధ్యక్షుడు నర్సింహ నేతాజీ పొదుపు సంఘం సభ్యులకు జ్ఞాపిక అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ సమఖ్యా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ చారి, అభ్యుదయ సహాయ సహకార సంఘాల సమాఖ్యా పర్యవేక్షణ అధికారి బాల్‌రాజ్ గౌడ్, మన్సాన్‌పల్లి నేతాజీ పొదుపు సంఘం అధ్యక్షుడు దయానంద్ గౌడ్, ఉపాధ్యాక్షుడు శ్రీధర్ గౌడ్, కార్యదర్శి శ్రీనివాస్‌చారి, సహాయ కార్యదర్శి కుమార్ యాదవ్, కోశాధికారి మల్లేశ్ ముదిరాజ్, పాలకవర్గ సభ్యులు పాండయ్య, శ్రీధర్ చారి, ఎండి.హాజీ, వెంకటేశ్ గౌడ్, రాజేశ్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, శేఖర్ పలువురు సభ్యులు పాల్గొన్నారు.
వరుసగా నాలుగోసారి కైవసం చేసుకున్న మన్సాన్‌పల్లి సమాఖ్య సంఘం