
యువకుడి అదృశ్యం
ఏడాది గడిచినా దొరకని ఆచూకీ
పహాడీషరీఫ్: తాగిన మైకంలో ఓ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్ తెలిపిన ప్రకారం.. న్యూ బాబానగర్‌కు చెందిన షేక్ షా వలీ పెద్ద కుమారుడు మహ్మద్ ఇమ్రాన్ ఖాన్(28) స్క్రాప్ సేకరిస్తుంటాడు. గతేడాది నవంబర్ 24వ తేదీన తాగిన మైకంలో ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. తిరిగి ఎంతకి రాకపోవడంతో డిసెంబర్ 1వ తేదీన ఇమ్రాన్ తల్లి జాహెదా నాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాటి నుంచి ఆచూకీ లభించడలేదు. ఇతని ఆచూకీ తెలిసిన వారు బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62366 నంబర్‌లో సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.