ఫాస్ట్‌ట్యాగ్‌ల చోరీ | - | Sakshi
Sakshi News home page

ఫాస్ట్‌ట్యాగ్‌ల చోరీ

May 19 2025 8:00 AM | Updated on May 19 2025 8:00 AM

ఫాస్ట

ఫాస్ట్‌ట్యాగ్‌ల చోరీ

క్యాబ్‌లకు విక్రయం

ట్రైనీ కానిస్టేబుల్‌ అరెస్ట్‌

శంషాబాద్‌: పోలీసు వాహనాల ఫాస్ట్‌ట్యాగ్‌లను చోరీ చేసి విక్రయిస్తున్న ట్రైనీ కానిస్టేబుల్‌ ఆర్‌జీఐఏ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. గతంలో హోంగార్డుగా పనిచేసి ప్రస్తుతం శిక్షణ పొందుతున్న నిసార్‌ అహ్మద్‌ (28) అనే వ్యక్తి పోలీసు వాహనాలకు ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌లను చోరీ చేసి వాటిని క్యాబ్‌ డ్రైవర్‌లకు విక్రయించాడు. దీంతో సంబంధిత వాహనాలకు సంబంఽధించిన టోల్‌చార్జీలు పోలీసుల వాహనాలకు వెళుతున్నాయి. వీటిని విక్రయించిన నిసార్‌ అహ్మద్‌ వారి నుంచి నెలవారిగా ఒక్కో వాహనం నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. టోల్‌ సిబ్బంది సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన ఆర్‌జీఐఏ పోలీసులు నిసార్‌ అహ్మద్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడు విక్రయించిన ఫాస్ట్‌ట్యాగ్‌లను వినియోగిస్తున్న మూడు క్యాబ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

ప్రేమ పేరుతో వేధింపులు

ఉరేసుకుని బాలిక ఆత్మహత్య

శంషాబాద్‌ రూరల్‌: ప్రే మ పేరిట వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని పెద్దతూప్రలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వి.జంగయ్య, అనిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు దివ్య(16)ను అదే గ్రామానికి చెందిన తెలగమల్ల రవి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 16న రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ రెండో అంతస్తులో నిద్రకు ఉపక్రమించారు. అదే రోజు రాత్రి దివ్య సెల్‌ఫోన్‌ తీసుకుని కింద అంతస్తులోకి వెళ్లింది. ఎంతసేపటికి పైకి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా గది లోపలి నుంచి గడియపెట్టి ఉన్నది. దీంతో కిటికీ నుంచి లోపలికి చూడగా.. దివ్య చున్నీతో పైకప్పు ఉక్కుకు ఉరేసుకుని కనిపించింది. తలుపులు తెరిచి లోనికి వెళ్లి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. రవి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి రవిని అదుపులోకి తీసుకున్నారు.

ఫాస్ట్‌ట్యాగ్‌ల చోరీ 
1
1/1

ఫాస్ట్‌ట్యాగ్‌ల చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement