
మహిళలతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం: ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నంలో ఆదివారం రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉచిత బస్సు ప్రయాణ పథకాలను ఆయన ప్రారంభించారు. బస్సులో మంచాల వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫార్మాసిటీతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలేకాదు సుమారు 200 కిలోమీటర్ల మేర గాలి, నీరు కలుషితం అవుతాయని అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులకుప్పగా కేసీఆర్ ప్రభుత్వం మార్చిందని విమర్శించారు. ప్రజల ప్రభుత్వం వచ్చిందని, ప్రైవేట్ ప్రభుత్వం పోయిందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు పరుస్తామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో కొత్తగా ఒక్క రేషన్‌కార్డు, పింఛన్లు ఇవ్వలేదని మండిపడ్డారు. రెక్కాడితేగాని డొక్కాడని పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ ఆరోగ్యశ్రీని అద్భుత పథకంగా అభివర్ణించారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్ అన్వర్, జెడ్పీటీసీ భూపతిగాళ్ల మహిపాల్, మున్సిపల్ చైర్ పర్సన్లు కప్పరి స్రవంతి, ఆర్తిక, ఆర్టీసీ డీఎం వెంకటనర్సప్ప తదితరులు పాల్గొన్నారు.
గ్యారంటీలను అమలు చేస్తాం
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి