
సీఎంకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఆసీఫ్‌అలీ
కడ్తాల్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డిని రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసీఫ్‌అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలోని సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆసీఫ్‌అలీ మాట్లాడుతూ.. జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ప్రతిపక్షంలో ఉంటూ నిరంతరం ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడిన వ్యక్తికే రాష్ట్ర ప్రజలు పట్టంకట్టారన్నారు. పార్టీ నాయకులతో కలుపుగోలుగా ఉంటూ కాంగ్రెస్‌ను అధికారంలోని తీసుకువచ్చిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. ప్రజాప్రభుత్వంతో రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ పరిష్కారామవుతాయన్నారు.
రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసీఫ్‌అలీ