వేడెక్కిన పంచాయతీ | - | Sakshi
Sakshi News home page

వేడెక్కిన పంచాయతీ

Dec 4 2025 9:09 AM | Updated on Dec 4 2025 9:09 AM

వేడెక

వేడెక్కిన పంచాయతీ

● మొదటి విడత అభ్యర్థుల ఖరారు ● గుర్తుల కేటాయింపుతో ఊపందుకున్న ప్రచారం ● రెండో విడతలో ముగిసిన స్క్రుటినీ ● మూడో విడత గ్రామాల్లో మొదలైన నామినేషన్లు

బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు

● మొదటి విడత అభ్యర్థుల ఖరారు ● గుర్తుల కేటాయింపుతో ఊపందుకున్న ప్రచారం ● రెండో విడతలో ముగిసిన స్క్రుటినీ ● మూడో విడత గ్రామాల్లో మొదలైన నామినేషన్లు

వేములవాడ/సిరిసిల్లటౌన్‌: గ్రామాల్లో రాజకీయ ‘పంచా యతీ’ వేడెక్కింది. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లోని అభ్యర్థుల జాబితా ఖరారైంది. బరిలో నిలిచిన వారికి అధికారులు గుర్తులు సైతం కేటాయించా రు. దీంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నా రు. సర్పంచ్‌గా ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో కు లసంఘాలను, యువజన సంఘాలను కలుపుకొని ముందుకెళ్తున్నారు. పలు కులసంఘాలకు ఇది చే స్తాం.. అది చేస్తామంటూ తాయిలాలు ఇస్తూ వారి ని కలుపుకొని వెళ్తున్నారు. ఈనెల 11న జరిగే ఎన్ని కల్లో భారీ పోలింగ్‌ జరిగేలా ప్రణాళికలు వేస్తున్నా రు. ఉద్యోగరీత్య ఇతర గ్రామాల్లో ఉంటున్న తమ బంధువులు, అనుచరులను గ్రామాలకు రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

వేకువజాము నుంచే ఇండ్ల వద్దకు..

గ్రామాల్లో జనం ఉదయం 9 గంటలు దాటిందంటే ఇళ్ల వద్ద కనిపించరు. ఉదయం సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఉదయం 7 గంటల నుంచే ప్రచారం మొదలుపెట్టారు. అక్కా, బావ, మామ, చెల్లె.. అంటూ వరుసలు కలిపి ముందుకెళ్తున్నారు. ఈసారి ఎలైగానా తమకే ఓటు వేసి గెలిపించాలని వేడుకుంటున్నారు.

బుజ్జగింపులతో విత్‌డ్రాలు

వేములవాడ ప్రాంతంలోని మొదటిదఫా జరిగే సర్పంచ్‌ ఎన్నికలకు బుధవారం విత్‌డ్రా చేయించేందుకు రాజకీయ పార్టీల పెద్దలు రంగంలోకి దిగారు. పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా నిలిస్తే భవిష్యత్‌లో మంచి పదవుల్లో అవకాశం ఇస్తామంటూ హామీ ఇచ్చి విత్‌డ్రా చేయించారు. ఇలా చాలా గ్రామాల్లో రెబెల్స్‌గా ఉన్న పలువురు పార్టీ నాయకులను ఎన్నికల బరిలో నుంచి తప్పించి పార్టీ బలపరిచిన అభ్యర్థికి పోటీలేకుండా చూసుకున్నారు.

పల్లెల్లో పంచాయితీలు

తొలివిడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లోని అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తికాగా.. రెండో విడతలో బుధవారం నామినేషన్ల స్క్రుటినీ ముగిసింది. మూడో విడత పంచాయతీలకు నామినేషన్లపర్వం మొదలైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీల్లో ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. కులాలు, వర్గాల వారీగా తమ వారినే గెలిపించుకుందామనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఈమేరకే నామినేషన్లు వేస్తున్నారు.

రుద్రంగిలో ఏడు గ్రామాలు ఏకగ్రీవం

చందుర్తి/రుద్రంగి/వేములవాడఅర్బన్‌/కోనరావుపేట: రుద్రంగి మండలంలోని పది గ్రామాలకు ఏడు 7 గ్రామాలు ఏకగ్రీవం కాగా.. మూడు గ్రామాలకు మాత్రమే ఎన్నికలు జరుగనున్నాయి. గైదిగుట్టతండా, అడ్డబోర్‌తండా, వీరునితండా, చింతామణితండా, బడితండా, రూప్లానాయక్‌తండా, సర్పంచ్‌తండా గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మిగిలిన మూడు గ్రామాల్లో పది మంది సర్పంచ్‌ అభ్యర్థులు, మండలంలోని 86 వార్డులకు 52 వార్డులు ఏకగ్రీవం అవ్వగా మిగిలిన 34 వార్డులకు 91 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కోనరావుపేట మండలంలో రెండు గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

చందుర్తి బరిలో 64 మంది

చందుర్తి మండలంలోని 19 జీపీల్లో 113 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో 27 నామినేషన్లు తొలగించగా 86 మంది మిగిలారు. వీరిలో బుధవారం 22 మంది విత్‌డ్రా చేసుకోవడంతో 64 మంది బరిలో నిలిచారు. 174 వార్డుస్థానాలకు 399 నామినేషన్లు వచ్చాయి. 25 వార్డులకు సింగిల్‌ నామినేషన్లు వేయడంతో 24 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. బుధవారం మరో వార్డు ఏకగ్రీవమైంది. 149 వార్డులకు 373 మంది అభ్యర్థులు వార్డు సభ్యులుగా పొటీలో ఉన్నారని చందుర్తి ఎంపీడీవో రాధ తెలిపారు. వేములవాడ అర్బన్‌ మండలంలో 11 గ్రామపంచాయతీల్లో 47 మంది సర్పంచ్‌ అభ్యర్థులుగా బరిలో ఉండగా.. 104 వార్డు స్థానాలకు 12 ఏకగ్రీవం కాగా.. 218 మంది పోటీ చేస్తున్నారు.

మండలం జీపీలు ఏకగ్రీవ సర్పంచ్‌ వార్డుసభ్యుల

జీపీలు అభ్యర్థులు అభ్యర్థులు

వేములవాడఅర్బన్‌ 11 –– 47 218

వేములవాడరూరల్‌ 17 –– 52 262

కోనరావుపేట 28 02 122 459

చందుర్తి 19 –– 64 373

రుద్రంగి 10 07 10 91

వేడెక్కిన పంచాయతీ1
1/1

వేడెక్కిన పంచాయతీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement