శాంతియుత ఎన్నికలకు సహకరించాలి
● నోడల్ అధికారి శేషాద్రి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలో స్థానికసంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అభ్యర్థులు సహకరించాలని నోడల్ అధికారి శేషాద్రి కోరారు. మండలంలోని వెంకటాపూర్, హరిదాస్‌నగర్, రాచర్లగొల్లపల్లి గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. ఎలాంటి తప్పులు లేకుండా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవాలని సూచించారు. సమయం దాటిన తర్వాత నామినేషన్ల స్వీకరణ ఉండదని స్పష్టం చేశారు. ఎంపీడీవో సత్తయ్య, ఎన్నికల అధికారులు ఉన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): వికలాంగుల సాధికారతను ప్రోత్సహించాలని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జ్యోతి కోరారు. జిల్లా న్యాయ సేవాధికరసంస్థ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. తంగళ్లపల్లి మండలంలోని భవిత కేంద్రంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. జ్యోతి మాట్లాడుతూ వికలాంగుల హక్కులు, ప్రభుత్వ పథకాలు, న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. అనంతరం భవిత కేంద్రంలోని చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. తంగళ్లపల్లి ఎంపీపీఎస్ హెచ్‌ఎం వెంకటేశ్వరస్వామి, భవిత కేంద్రం ఐఈఆర్పీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లఅర్బన్: ఇందిరా మహిళా శక్తి వస్త్రోత్పత్తి ఆర్డర్లు, స్కూల్ యూనిఫాం వస్త్రం ఆర్డర్లను అన్ని మ్యాక్స్ సంఘాలకు సమానంగా ఇవ్వాలని జిల్లా పవర్‌లూమ్ మ్యాక్స్ సంఘాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిమ్మని ప్రకాశ్ కోరారు. ఈమేరకు జిల్లా సహాయ సంచాలకుడికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈనెల 2న కొన్ని మ్యాక్స్ సంఘాలకు ఎక్కువ, మరికొన్నింటికి తక్కువ ఆర్డర్లు ఇచ్చారన్నారు. ఇలా ఇవ్వడం ద్వారా చిన్న తరగతి సంఘాల సభ్యులు, కార్మికులు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. భీమని రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని లింగన్నపేట జెడ్పీ హైస్కూల్‌లో 8వ తరగతి విద్యార్థి గుగులోత్ రాఘవ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల జరిగిన ఉమ్మడి కరీంనగర్ జోనల్ స్థాయి అండర్ 14 క్రికెట్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాడు. ఈనెల 5 నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో రాఘవ పాల్గొంటాడని పీఈటీ నరేశ్ తెలిపారు. విద్యార్థిని స్కూల్ హెచ్‌ఎం గంగారాం తదితరులు అభినందించారు.
7 నుంచి రాష్ట్ర మహాసభలు
సిరిసిల్లటౌన్: రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి కోరారు. ఈనెల 7, 8, 9వ తేదీలలో మెదక్‌లో జరిగే సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభల పోస్టర్‌ను బుధవారం స్థానిక పార్టీ ఆఫీస్‌లో ఆవిష్కరించారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కోడం రమణ తదితరులు పాల్గొన్నారు.
శాంతియుత ఎన్నికలకు సహకరించాలి
శాంతియుత ఎన్నికలకు సహకరించాలి
శాంతియుత ఎన్నికలకు సహకరించాలి


