
జ్వరాలపై ఇంటింటీ సర్వే చేయాలి
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత
సిరిసిల్ల/గంభీరావుపేట(సిరిసిల్ల): జిల్లాలో జ్వరాల నివారణకు ఇంటింటీ సర్వే నిర్వహించి మందులు పంపిణీ చేయాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. ముస్తాబాద్ మండలం పోత్గల్ ఆరోగ్య కేంద్రం, ఆవునూరు ఆరోగ్య ఉపకేంద్రాలు, శుక్రవారం తనిఖీ చేశారు. డ్రై డే తీరును పరిశీలించారు. రజిత మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నీరు నిల్వ ఉంటే లార్వా పెరుగుతుందన్నారు. డ్రై డేలో భాగంగా క్షేత్రస్థాయిలో పరిసరాల పరిశుభ్రతకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాలన్నారు. డీపీవో రాజేందర్, హెచ్‌ఈవో లింగం, సింధూజ, సాయి పాల్గొన్నారు.