ఆర్థిక వనరులు లేకుండా జిల్లా ఏర్పాటు బాధాకరం
● మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి
గిద్దలూరు (బేస్తవారిపేట): మార్కాపురం జిల్లా ఏర్పాటును స్వాగతిస్తున్నామని.. అయితే పూర్తిగా ఆర్థిక వనరులు లేకుండా చేయడం బాధాకరమైన విషయమని వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. ఆదివారం గిద్దలూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనాయకులతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. లక్ష ఎకరాల ప్రభుత్వ భూములున్న దర్శి నియోజకవర్గాన్ని పాత ప్రకాశం జిల్లాలో కలపడంతో మార్కాపురం జిల్లాకు అన్యాయం చేసినట్లే అన్నారు. దర్శి మార్కాపురం జిల్లాలో ఏదో ఒకనాడు ఇండస్ట్రియల్ కారిడార్ అయ్యేదన్నారు. నూతన జిల్లాలో ఉద్యోగ అవకాశాలు, జిల్లాకు ఆర్థిక వనరుగా ఉండేదని చెప్పారు. కొత్త జిల్లాలో ఉన్న ఏకై క మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తే జిల్లా ప్రజలకు ఉచిత వైద్యం దూరమవుతుందన్నారు. గిద్దలూరును నూతన రెవెన్యూ డివిజన్‌గా చేయాలని కోరారు. ఇప్పటికే ఉన్న కనిగిరి, మార్కాపురం డివిజన్‌తోపాటు గిద్దలూరును చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం నూతన జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాలు అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి, మాజీ ఎంపీపీ కడప వంశీధరరెడ్డి, జెడ్పీటీసీ సారె వెంకటనాయుడు, మండల కన్వీనర్‌లు మానం బాలిరెడ్డి, ఆవుల శ్రీధర్‌రెడ్డి, గొంగటి చెన్నారెడ్డి, ఏరువ రంగారెడ్డి, యేలం మురళి, రవికుమార్, నాయకులు స్వామిరంగారెడ్డి, బీవీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఒంగోలు సిటీ: పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ఎ.ఈశ్వర రెడ్డి ఆదివారం ప్రకటించారు. అధ్యక్షునిగా సంతనూతలపాడు డీఈఈ ఓ.కృష్ణ మోహన్, జనరల్ సెక్రటరీగా మార్కాపురం ఏఈఈ విజయ మోహన్ రాజా, వైస్ ప్రెసిడెంట్‌గా కందుకూరు డీఈఈ మాలకొండయ్య, ట్రెజరర్‌గా మార్కాపురం ఏఈఈ వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కనిగిరి ఏఈఈ బి.బ్రహ్మయ్యలను ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికై న నూతన కార్యవర్గాన్ని పంచాయతీరాజ్ ఎస్‌ఈ అశోక్ అభినందనలు తెలిపారు.
ఆర్థిక వనరులు లేకుండా జిల్లా ఏర్పాటు బాధాకరం


