గమ్యం చేరగా..
ఉల్లాసంగా, ఉత్సాహంగా విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీలు
సంకల్పం తోడుగా..
ఒంగోలు వన్‌టౌన్: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని దివ్యాంగులకు ఆటలు, క్రీడల పోటీలను శనివారం ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించారు. పోటీలు ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖాధికారి సీహెచ్. సువార్త మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెస్, క్యారమ్స్, రన్నింగ్, షార్ట్‌ఫుట్, బ్‌లైండ్ క్రికెట్, స్కిప్పింగ్ టగ్ ఆప్ వార్, డిస్కస్ త్రో, ట్రై సైకిళ్లరేస్, మోటార్ బైక్ రేస్, వాలీబాల్ తదితర పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని ప్రభుత్వ ప్రత్యేక పాఠశాలలు, ప్రభుత్వ బాలుర వసతి గృహ విద్యార్థులతో పాటు వివిధ ప్రైవేటు ప్రత్యేక పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ప్రభుత్వ బధిరుల పాఠశాల, ఒంగోలు, దివ్యాంగుల బాలుర వసతి గృహం, ఒంగోలు, బధిరుల ప్రత్యేక పాఠశాల, చీమకుర్తి ప్రత్యేక మానసిక, బధిరుల పాఠశాల, కనిగిరి మనోవికాస్ మానసిక, ఒంగోలులోని ప్రత్యేక అవసరాల పాఠశాల, మార్కాపురంలోని స్ఫూర్తి మానసిక, ప్రత్యేక అవసరాల పాఠశాల, చైతన్య బధిరుల ప్రత్యేక పాఠశాల, సారా కవెనంట్ హోం, గుడ్ డే అంధుల ప్రత్యేక పాఠశాల, దివ్యాంగుల సంఘాల నుంచి దాదాపు 500 మంది దివ్యాంగులు ఉత్సాహంగా పాల్గొని వివిధ క్రీడా విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. గెలుపొందిన వారికి అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రోజు బహుమతులు ప్రదానం చేయనున్నారు. కార్యక్రమాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు ప్రారంభించారు.
గమ్యం చేరగా..
గమ్యం చేరగా..
గమ్యం చేరగా..
గమ్యం చేరగా..


