రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు
యర్రగొండపాలెం: స్థానిక సీఎస్ గోడౌన్‌తో పాటు పట్టణంలోని పలు రేషన్ షాపులపై డిప్యూటీ కలెక్టర్ అరవకుమార్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. తొలుత గోడౌన్‌లో ఉన్న బియ్యం, రికార్డులు, ఆయా రేషన్ షాపుల్లో ఉన్న స్టాక్‌తోపాటు రికార్డులు తనిఖీ చేశారు. ఈ నెల 1వ తేదీన రేషన్ పంపిణీ చేయాల్సి ఉంది. అందుకు రేషన్ షాపుల్లో బియ్యం, పంచదార నిల్వ ఉంచారు. రేషన్ పంపిణీ చేయకముందే కొంతమంది గోడౌన్ నుంచి నేరుగా బియ్యం అక్రమంగా తెలుగు తమ్ముళ్ల గోడౌన్‌లకు చేరుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు రేషన్ షాపులను తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. దాడుల్లో ఎన్‌ఫోర్స్ మెంట్ డీటీ చంద్రశేఖర్, గోడౌన్ డీటీ భ్రమరాంబ, ఆర్‌ఐ షేక్ సర్దార్ పాల్గొన్నారు.


