ద్విచక్ర వాహనాలు
6,000
ఆర్టీసీ బస్సులు
వాహనాలపై నియంత్రణ లేక ప్రధాన రహదారులు, జంక్షన్లు జామ్
మార్కాపురం టౌన్:
మార్కాపురం పట్టణాన్ని ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి బయట పడేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి వరకు రచించిన ప్రతివ్యూహాలు పెద్దగా ఫలితాన్నివ్వలేకపోయాయి. రహదారులపై ఆగిపోయిన భారీ వాహనాల మధ్య ద్విచక్రవాహనదారులు సర్కస్ ఫీట్లు చేస్తుండగా.. పాదచారులు సైతం పాములా మెలికలు తిరుగుతూ ముందుకెళ్తున్న దుస్థితి. వాహనాల రణగొణ ధ్వనుల మధ్య గమ్యస్థానాలకు చేరుకునేసరికి ఉద్యోగులతోపాటు ఇతర వర్గాలవారు డీలా పడిపోతున్నారు. రోడ్లపై ఆక్రమణలు తొలగించడం, అవసరమైన చోట రహదారుల విస్తరణ పనులు చేపట్టడం, అడ్డగోలు పార్కింగ్‌ను కట్టడి చేయడంతోపాటు ప్రధాన కూడళ్లలో సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే ట్రాఫిక్ సమస్య ఓ కొలిక్కొస్తుందని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం నుంచి జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన మార్కాపురంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు
ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని
స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
● పట్టణ ప్రధాన కూడళ్లలో సిగ్నలింగ్ వ్యవస్థ అవశ్యం
● అడ్డగోలు పార్కింగ్‌ను కట్టడి చేయాలని
జనం అభిలాష
● ట్రాఫిక్ స్టేషన్ ఏర్పాటుపై ఎస్పీ దృష్టి సారించాలని ప్రజల వినతి
అడ్డగోలు పార్కింగ్‌తోనే సమస్య
మార్కాపురం రోడ్లపై వాహనాలు నడపడమంటే సర్కస్ ఫీట్లు చేయడం లాంటిదే. నెహ్రూ బజారు, నాయుడు బజారు, మెయిన్ బజారులలో పార్కింగ్ స్ధలం లేకపోవడంతో హోటల్స్‌కు, కిరాణా షాపులకు, ఫ్యాన్సీ షాపులకు వచ్చేవారు తమ వాహనాలను షాపుల ముందు పార్కింగ్ చేస్తున్నారు. నాయుడు బజారు, కొత్తమార్కెట్, పాత మార్కెట్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో కూడా సమయపాలన పాటించకుండా లోడింగ్, అన్‌లోడింగ్ కోసం భారీ వాహనాలను రోడ్డుపై నిలిపి ఉంచడంతో తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. పార్కింగ్ ప్రదేశాలు లేకపోవడంతో వివిధ పనుల నిమిత్తం, అలాగే షాపింగ్‌కు వచ్చిన ప్రజలు తమ వాహనాలను రోడ్డుపైనే నిలిపి ఉంచుతున్నారు. దీంతో తరచుగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. రద్దీ ప్రదేశాల్లో సెంట్రల్ పార్కింగ్ సిస్టమ్‌పై పోలీసులు దృష్టి సారిస్తే కొంత మేర సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
ట్రాఫిక్ స్టేషన్‌తోనే పరిష్కారం!
ట్రాఫిక్ నియంత్రణకు మార్కాపురం పట్టణంలో వివిధ సెంటర్లలో 8 మంది హోంగార్డులు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక ఎస్సై ఉన్నప్పటికీ ట్రాఫిక్ నియంత్రణ కష్టంగా మారింది. కొందరు ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఎక్కడపడితే అక్కడ ఆటోలు ఆపడం, టర్నింగ్ తిప్పడం లాంటివి చేస్తుండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవించడంతోపాటు ట్రాపిక్ సమస్యకు కారణమవుతున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు ప్రయాణికుల కోసం కంభం సెంటర్, దోర్నాల సెంటర్, గడియార స్తంభం సెంటర్, ఒంగోలు సెంటర్‌లో బస్సులు పదే పదే నిలపడం వల్ల కూడా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. మార్కాపురం పట్టణానికి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ మంజూరు చేయడంతోపాటు అదనపు సిబ్బందిని నియమిస్తే వాహనాల రద్దీని నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
రోజూ గంట వృథా..
రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, నియంత్రణ లేని వాహనాలతో మార్కాపురం పట్టణ ప్రజలు ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. సుమారు లక్ష జనాభా ఉన్న పట్టణంలో 4 వేలకు పైగా ఆటోలు, సుమారు 150కి పైగా బస్సులు 6 వేల ద్విచక్ర వాహనాలు, 1600కు పైగా కార్లు రాకపోకలు సాగిస్తున్నాయి. పట్టణంలో 4 ఇంజినీరింగ్ కళాశాలలు, 10 ఇంటర్, డిగ్రీ ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు పట్టణంలో వివిధ ప్రైవేట్ పాఠశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 40కి పైగా బస్సులు తిరుగుతుంటాయి. విద్యార్థులను తీసుకెళ్లేందుకు, దించేందుకు పాత బస్టాండ్, దోర్నాల సెంటరు, నాయుడు బజారు, కంభం సెంటరు, కోర్టు సెంటరు, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో బస్సులు ఆపుతారు. ఈ క్రమంలో వెనుకవచ్చే వాహనాలన్నీ హారన్ల మోత మోగిస్తున్నాయి. కంభం రోడ్డులో ఎల్‌ఐసీ ఆఫీసు వద్ద ఉదయం, సాయంత్రం రోజూ సుమారు గంట సమయం ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందంటే పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అయ్యప్పస్వామి గుడిలైన్‌లో ట్రాఫిక్ ఇలా
150
మార్కాపూర్.. ట్రాఫికర్
మార్కాపూర్.. ట్రాఫికర్
మార్కాపూర్.. ట్రాఫికర్
మార్కాపూర్.. ట్రాఫికర్
మార్కాపూర్.. ట్రాఫికర్
మార్కాపూర్.. ట్రాఫికర్
మార్కాపూర్.. ట్రాఫికర్
మార్కాపూర్.. ట్రాఫికర్
మార్కాపూర్.. ట్రాఫికర్


