మిర్చి తోటలో గంజాయి సాగు!
పెద్దదోర్నాల: సాగులో ఉన్న మిర్చి తోటలో గంజాయి మొక్కలను ఎకై ్సజ్ అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. ఈ సంఘటన పెద్దదోర్నాల మండల పరిధిలోని జమ్మిదోర్నాల పంట పొలాల్లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎకై ్సజ్ సీఐ ముక్కు వెంకటరెడ్డి కథనం మేరకు.. జమ్మిదోర్నాలలో రైతు బోయపాటి రాజబాబు మిర్చి తోటలో అక్కడక్కడా పెంచిన గంజాయి మొక్కలను ఎకై ్సజ్ పోలీసులు గుర్తించారు. ఆ మొక్కలను మధ్యవర్తుల సమక్షంలో పీకి ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు. గురువారం మండలంలో గంజాయి కలిగిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించడంతోపాటు వారి వద్ద కిలోన్నర గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజే జమ్మిదోర్నాలలో గంజాయి మొక్కలు వెలుగుచూడటం ఈ ప్రాంతంలో మాదకద్రవ్యాల వినియోగం మితిమీరుతోందని స్పష్టమైంది. దాడిలో అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బాలయ్య, ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ గోపాలకృష్ణతోపాటు ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.
మొక్కలు గుర్తించి ధ్వంసం చేసిన ఎకై ్సజ్ అధికారులు


