మార్కాపురాన్ని అన్యాయం చేయొద్దు
రాజకీయ స్వార్థం కోసం జిల్లాగా చేశారు కనీస ఆదాయ వనరులు కూడా లేవు మా ప్రభుత్వ హయాంలో 90 శాతం వెలుగొండ పనులు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ తగదు ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు బత్తుల, ఒంగోలు ఇన్‌చార్జి చుండూరి
ఒంగోలు సిటీ: చంద్రబాబు తమ రాజకీయ స్వార్థం కోసం మార్కాపురాన్ని జిల్లాగా చేశారని వైఎస్సార్ పీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరు రవి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ఎలాంటి ఆదాయ వనరులు చూపకుండా, కనీస నీటి సౌకర్యంలేని నాలుగు అసెంబ్లీలతో మార్కాపురాన్ని జిల్లా చేయడం సరికాదని బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో కనీసం రూ.వెయ్యి కోట్లు ఆదాయం తెచ్చే వనరులు లేవన్నారు. ఏదో జిల్లా ఇచ్చామని మాయ చేస్తున్నాన్నారు తప్ప ఆ జిల్లా ప్రజలకు మేలు చేసేందుకు కాదని దుయ్యబట్టారు. ఏ విధంగా ఆదాయం లేని, వ్యవసాయం లేని జిల్లాగా మార్కాపురాన్ని మార్చొద్దన్నారు. రాజకీయ స్వార్థం కోసం ఇలా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. దర్శిని కూడా మార్కాపురం జిల్లాలో కలపాలని ఆయన కోరారు. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో వెలుగొండ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే.. మా ప్రభుత్వ హయాంలో పనులు 90 శాతం పూర్తి చేశామన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి నీళ్లు ఇచ్చేవారమన్నారు. ఒంగోలులో మెడికల్ కళాశాల ఉన్నా..వెనుకబడిన ప్రాంతంగా ఉన్న పశ్చిమ ప్రకాశానికి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు, పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్యను అందుబాటులో తెచ్చేందుకు మార్కాపురంలో మరో మెడికల్ కళాశాల ఏర్పాటుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపట్టారన్నారు. దానిని సైతం ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు.
పరిపాలన సౌలభ్యం కోసం మా ప్రభుత్వ హయాంలో పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లా ఏర్పాటు చేశామని వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు తెలిపారు. ఒక జిల్లాకు న్యాయం చేసి మరో జిల్లాకు అన్యాయం చేయడం సరికాదన్నారు. ప్రకాశం జిల్లాకు మళ్లీ పోర్టు వచ్చిందన్నారు. మార్కాపురం ఆదాయ వనరులు లేని జిల్లాగా చేయడం పాపమన్నారు. దొనకొండ పారిశ్రామికవాడగా అభివృద్ధి చేస్తామంటున్నారని, మార్కాపురానికి దగ్గరగా ఉన్న దొనకొండ ప్రాంతాన్ని ఆ జిల్లాలో కలపాలన్నారు.
మెప్మా అవినీతి వేళ్లు ఎమ్మెల్యే కార్యాలయం వైపు
మెప్మా అక్రమాల్లో ఎమ్మెల్యే పీఏల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయని, అన్ని వేళ్లూ ఎమ్మెల్యే కార్యాలయం వైపు చూపిస్తున్నాయని చుండూరు రవిబాబు ఆరోపించారు. 2021 నుంచి 2026 వరకూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదులన్నీ మెప్మా అధికారులపైనా, మీ పీఏలపైనా అని అన్నారు. విచారణ సత్వరం పూర్తి చేసి అమాయకులకు న్యాయం చేయాలని, దోషులను గుర్తించి వారి వద్ద నుంచి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. మా ప్రభుత్వంపై బుదరజల్లడం మాని తప్పుచేసిన వారిని శిక్షించాలని కోరుతున్నామన్నారు.
మార్కాపురాన్ని అన్యాయం చేయొద్దు


