జ్యోతిరావు పూలేకు నివాళులు
ఒంగోలు సిటీ: మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు శుక్రవారం ఘన నివాళులర్పించారు. పూలే చేసిన సేవలను స్మరించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు దుంపా చెంచురెడ్డి, ఉప్పలపాటి ఏడుకొండలు (వేణు), రొండా అంజిరెడ్డి, క్రాంతి కుమార్, కూనం గౌతం, పెట్లూరి ప్రసాద్, దాసరి కరుణాకర్, తాత నరసింహ గౌడ్, పాలడుగు రాజీవ్, షేక్ మీరావలి, సయ్యద్ అప్సర్, బత్తుల ప్రమీల, బడుగు ఇందిరా, బడుగు శోభ లత, బడుగు మాధవి, కార్పొరేటర్ ఇమ్రాన్‌ఖాన్, నాగరాజు, 48 డివిజన్ అధ్యక్షుడు, వీసం బాలకృష్ణ, షేక్ జిలాని బాషా, ఫణిదపు సుధాకర్, కుట్టుబోయిన కోటి యాదవ్, కుట్టు బోయిన సురేష్, సన్నపురెడ్డి రవణమ్మ, ఝాన్సీ, పులుసు సురేష్, దేవా, దేవరపల్లి అంజిరెడ్డి, పేరం ప్రసన్న, పి.కృష్ణవేణి, ఒ.మహాలక్ష్మి, జి.పద్మశ్రీ, ఎస్.లీలాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


