కోర్టు కేసులో ఉన్న భూములపై విచారణ | - | Sakshi
Sakshi News home page

కోర్టు కేసులో ఉన్న భూములపై విచారణ

Nov 28 2025 7:20 AM | Updated on Nov 28 2025 7:20 AM

కోర్టు కేసులో ఉన్న భూములపై విచారణ

కోర్టు కేసులో ఉన్న భూములపై విచారణ

హనుమంతునిపాడు: కోర్టు కేసులో ఉన్న భూముల్లో పంటలు సాగు చేస్తున్నారన్న ఫిర్యాదులపై వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎం రజనీకుమారి గురువారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హనుమంతునిపాడు మండలంలోని ఉపేంద్రాపురం రెవెన్యూలో వెలిగండ్ల మండలం నరసమాంబాపురం గ్రామానికి చెందిన సర్వేనంబర్‌ 505 నుంచి 519 వరకు ఉన్న 25 ఎకరాల పట్టా భూములు కోర్టు కేసులో ఉన్నాయి. అయితే ఆ భూముల్లో నరసమాంబాపురం గ్రామానికి చెందిన రైతులు శాగంరెడ్డి రామిరెడ్డి, రమణమ్మ, కర్నాటి ధనమ్మ, రత్తమ్మలు 2024–25లో కంది పంట సాగు చేశారని, ఈ క్రాపు చేసుకోని రైతు భరోసా తీసుకున్నారు. అయితే కోర్టు కేసులో ఉన్న భూముల్లో పంటలు ఎలా సాగు చేశారని పగిడిమర్రి కృష్ణప్రసాద్‌ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ భూములను పరిశీలించామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ షేక్‌ జైన్‌లబ్దీన్‌, ఏఓలు రమణారావు, వి. రవికుమార్‌, ఏఏఏలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement