మార్కాపురంలో మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
పశ్చిమ ప్రకాశంలో రైతులు మిర్చిని ఎక్కువగా సాగుచేస్తున్నారు. అయితే తాము పండించిన పత్తిని గుంటూరు మార్కెట్‌యార్డుకు వెళ్లి విక్రయించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దీని వలన రైతులపై అదనపు భారం పడుతోంది. రైతు క్షేమం కోసం మార్కాపురంలోనే మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే రైతులకు ఖర్చులు, కష్టాలు తప్పుతాయి. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలి.
– నూనే శివారెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు సంఘం కార్యదర్శి
కేజీ పచ్చికాయ రూ.8కి తీసుకుంటున్నారు..
మేము 15 ఎకరాలు కౌలు తీసుకుని నిమ్మ తోట సాగు చేశాం. ఈ ఏడాది నిమ్మ కాయల దిగుబడి బాగా వచ్చింది. కానీ గిట్టుబాటు ధర లేదు. గతంలో ఇదే సీజన్‌లో కేజీ రూ.30 వరకు అమ్మిన కాయలు.. ఈ ఏడాది కేజీ రూ.8కి కమీషన్ మార్కెట్‌లో తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా దిగుబడి పెరగడంతో.. ఆ ప్రాంతాల్లో మార్కెట్ లేదని వ్యాపారులు చెప్తున్నారు. దీంతో ఏమీ చేయలేని దిక్కు తోచని స్థితిలో ఉన్నాం. చెట్టు మీద కాయ కోయకపోతే వచ్చే ఏడాది పూత రాదు. దీంతో రైతులు కోత చేస్తున్నారు. ఏడాదికి రూ.6 లక్షలు పెట్టుబడి పెట్టాం. కనీసం వడ్డీలు కూడా రాని పరిస్థితి. దీంతో దిక్కుతోచని దుస్థితిలో ఉన్నాం. ప్రభుత్వం నిమ్మ రైతును ఆదుకోవాలి.
– పఠాన్ షారుక్ ఖాన్, తురకపల్లి గ్రామం, హనుమంతునిపాడు మండలం
మార్కాపురంలో మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి


