కొన్నది తక్కువ..తిరస్కరించింది ఎక్కువ..!
టంగుటూరు: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో ఒక్కరోజే 684 పొగాకు బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. వేలం కేంద్రానికి గొర్లమిట్ట, మట్టిపాడు, శివపురం, మల్లవరప్పాడు, ఆలకూరపాడు, జమ్ములపాలెం, పొందూరు, కె. ఉప్పలపాడు గ్రామానికి చెందిన రైతులు 1339 బేళ్లను వేలానికి తీసుకురాగా 655 బేళ్లను కొనుగోలు చేసి 684 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.310, కనిష్ట ధర రూ.50, సరాసరి ధర రూ.110.31గా నమోదైంది. వేలంలో 46 మంది వ్యాపారులు పాల్గొన్నారు.
కొండపి: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో 510 బేళ్లు తిరస్కరణకు గురైనట్లు వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ తెలిపారు. క్లస్టర్ పరిధిలోని రామాయపాలెం, పోలిరెడ్డిపాలెం, జగ్గరాజుపాలెం గ్రామాల రైతులు 1584 బేళ్లను తీసుకురాగా 1074 బేళ్లను కొనుగోలు చేశారు. వేలంలో 13 కంపెనీలు పాల్గొన్నాయి.


