నిరంకుశ పాలనకు మూల్యం చెల్లించక తప్పదు
కొనకనమిట్ల:
ఎన్నికల హామీలను విస్మరించి, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా నిరంకుశ పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించక తప్పదని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు హెచ్చరించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానంలో నిర్మించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మంగళవారం సాయంత్రం కొనకనమిట్ల మండలంలోని సలనూతల గాజులపల్లి, నాగంపల్లి గ్రామాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 5 మెడికల్ కళాశాలలు పూర్తి చేసి వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలతో 10 కాలేజీలను ప్రైవేట్ వ్యక్తలకు కట్టబెట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. బాబు పాలనలో ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి పెరిగిపోయి దోచుకో.. దాచుకో అనే విధానంతో ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. వేల కోట్ల రూపాయల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టేందుకే ప్రైవేటీకరణ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. కోటి సంతకాల సేకరణతో చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిపించి, మెడికల్ కాలేజీల ప్రైటీకరణను అడ్డుకుంటామని చెప్పారు. కూటమి ప్రభుత్వ కుటిల నీతిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నా విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ విజయవంతంగా నిర్వహిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ స్థానిక ప్రజలతో సంతకాలు చేయించారు.
‘అన్నా’కు ఘనస్వాగతం
సలనూతల గాజులపల్లిలో సర్పంచ్ విడగొట్టు అంజనీకుమారి అంజయ్య, పార్టీ నాయకులు మువ్వా వెంకటస్వామిరెడ్డి, కందుల ఏబేలు, సుమలత, నాగంపల్లిలో సర్పంచ్ తాతిరెడ్డి చినవెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ తాతిరెడ్డి పెదవెంకటరెడ్డి, ఎంపీటీసీ కోండ్రు వెంకటేశ్వర్లు, మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు తంగిరాల బ్రహ్మారెడ్డి, మాజీ యూత్ కన్వీనర్ సైకం రమణారెడ్డి, మాజీ సర్పంచ్ కొక్కెర వెంకటేశ్వర్లు, కసిబిసి గురవయ్య తదితరుల ఆధ్వర్యంలో అన్నాతో పాటు మండల నాయకులకు ఘన స్వాగతం పలికారు. కోటి సంతకాల సేకరణలో ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణయాదవ్, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, మండల పార్టీ అధ్యక్షుడు మోరా శంకర్‌రెడ్డి, తర్లుపాడు మండల కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు, విద్యార్థి విభాగం నియోజకవర్గ కన్వీనర్ ఏలూరి సంజీవరెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ ఉడుముల కాశిరెడ్డి, సానికొమ్ము తిరుపతిరెడ్డి, పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు గోనుగుంట్ల శ్రీనివాసులు, మోరబోయిన మాలకొండయ్య, పసల చెన్నకేశవులు, సానికొమ్ము వెంకటస్వామిరెడ్డి, షేక్ మౌలాలి, పాతకోట వెంకటరెడ్డి, పాలూరి వెంకటేశ్వర్లు, పార్లపల్లి సిద్దానభి, చిరుగూరి కోటేశ్వరరావు, తాతిరెడ్డి పెదవెంకటరెడ్డి, బైరెడ్డి కొండారెడ్డి, దేవిరెడ్డి గోపాలరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీలను విస్మరించిన సీఎం చంద్రబాబు
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దారుణం
చంద్రబాబు ప్రభుత్వ పాలనపై మాజీ ఎమ్మెల్యే అన్నా ధ్వజం
నిరంకుశ పాలనకు మూల్యం చెల్లించక తప్పదు


