సివిల్స్‌లో ఎస్టీలకు ఉచిత శిక్షణ
ఒంగోలు వన్‌టౌన్: సివిల్స్‌లో ఎస్టీలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు రెగ్యులర్ డిగ్రీలో ఉత్తీర్ణులై, జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న వారు తమ పూర్తి బయోడేటాకు రెండు ఫొటోలు, విద్య, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్, పాన్‌కార్డు జిరాక్స్ కాపీలను జత చేసి, ఈ నెల 26వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గిరిజన విద్యార్థులకు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల కుటుంబ సంవత్సర ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలని స్పష్టం చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 30న స్క్రీనింగ్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డిసెంబర్ 10 నుంచి శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. వివరాలకు 9493343866ను సంప్రదించాలని సూచించారు.
అర్ధవీడు: మండల కేంద్రమైన అర్ధవీడులో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మంగళవారం గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు కుక్కల దాడిలో గాయాలపాలయ్యారు. జి.దానయ్య, రాజయ్యతో పాటు మరో ఐదుగురు కుక్క కాటుకు గురై కంభంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో సుమారు 50కి పైగా వీధి కుక్కలు ఉన్నాయని, రాత్రి పూట అత్యవసర పని మీద బయటకు వస్తే వెంటాడి కరుస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒంగోలు సిటీ: నగర శివారులోని నెక్ట్స్‌జెన్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను మంగళవారం జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ సందర్శించారు. ఈ ప్రాంగణంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. నిబంధనల మేరకు సౌకర్యాలు ఉన్నవో లేవో పరిశీలించి ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జేసీ స్కూలును సందర్శించారు. ఆయన వెంట కలికిరి సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సీఎస్ పరదేశి, నవోదయ స్కూల్ ప్రిన్సిపాల్ శివరాం, డీఈవో కిరణ్‌కుమార్, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, ఇతర అధికారులు ఉన్నారు.
సివిల్స్‌లో ఎస్టీలకు ఉచిత శిక్షణ


