మాజీ సర్పంచ్ కుమారునిపై టీడీపీ వర్గీయుల దాడి
కనిగిరిరూరల్: మాజీ సర్పంచ్ మల్లెల యాకోబు కుమారుడు ప్రవీణ్‌పై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడిన ఘటన మంగళవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం మండలంలోని తక్కెళ్లపాడులో వైఎస్సార్ సీపీ మద్దతు మాజీ సర్పంచ్ మల్లెల యాకోబు, అతని కుమారుడు ప్రవీణ్‌కు 1.28 ఎకరాల భూమి ఉంది. చాలా ఏళ్ల నుంచి ఆభూమిని ప్రవీణ్ కుటుంబీకులు సాగు చేసుకుంటూ పాస్ పుస్తకాలు, అన్‌లైన్ నమోదు ఉన్నట్లు తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, అతని అనుచరులు ఆభూమిలో ఇటీవల మట్టి తొలారు. తమ కుటుంబానికి చెంది, చాలకాలంగా తాము సాగు చేసుకుంటున్న పొలంలో మీరెందుకు మట్టిని తొలించారని ప్రవీణ్ ప్రశ్నించాడు. దీంతో పిచ్చాల శ్రీనివాసులరెడ్డి అతని మనుషులు గొడవకు దిగి దాడి చేశారు. గొడవలో మాజీ సర్పంచ్ మల్లెల యాకోబుకు, ప్రవీణ్‌కు గాయాలైనట్లు చెప్పారు. బాధితులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి 100కు కాల్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా భూ వివాదానికి సంబంధించి తక్కెళ్లపాడులో రెండు వర్గాలకు చెందిన వారు ఇచ్చిన పరస్పర ఫిర్యాదుల మేరకు ఇరువురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


